బలరాం-12

Posted on

ఆరోజు రాత్రంతా శ్రీలక్ష్మి రూమ్ లో.కూర్చుని ఏడుస్తూనే ఉంది…తనకేం పట్టనట్లు తన మొగుడు నిద్రపోయాడు…తెల్లారిణాక అందరికన్నా ముందే ఇంట్లో పానంత చేసింది…స్టేషన్ కి రెడి అవుతున్న మొగుడికి బట్టలు తీసుకుని బెడ్ రూమ్ కి వెళ్ళగానే విసుగ్గా తన చేతిలో బట్టలు తీసుకుని “ఇంకోసారి నా బట్టలు ముట్టుకుంటే చంపేస్తా…వేళ్ళు ఇక్కడినుండి….నువ్ ఈ ఇంట్లో పనిదానివి..అంతే…”అని లాగి చంపేమీద కొట్టి జుట్టు పట్టుకుని బెడ్ రూమ్ నుండి బయటకి నెట్టేసాడు…ఆరోజు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే అంతా హ్యాపీ గానే ఉంది నాన్న అని అబద్ధం చెప్పింది…తర్వాత పది రోజులపాటు శ్రీలక్ష్మి ని కుక్కలాగా చూసారు…

ఒకరోజు రాత్రి 12 గంటలకి తలుపు కొడితే శ్రీలక్ష్మి ఓపెన్ చేయగానే వాళ్ళ ఆయన వేరే అమ్మాయి భుజం మీద చెయ్ వేసి లోపలకి వచ్చాడు…నేరుగా ఆ అమ్మాయి ని బెడ్ రూమ్ కి తీసుకువెళ్లి గడి పెట్టుకున్నాడు…లోపల నుండి శ్రీలక్ష్మి ఊహించిన శబ్దాలు వస్తున్నాయి…అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది…ఇక్కక్డా కుక్క లాగా బ్రతకడం కంటే బలరాం దగ్గెరే రాజా ల బ్రతకడం మేలు అని రాత్రి 2 గంటలు టైం లో బయటికి వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్ కి వచ్చి నెల్లూరు బస్ ఎక్కింది…

ఇక్కడ బలరాం శ్రీలక్ష్మి వెళ్లినప్పటినుంది రోజు తాగుతూ వున్నాడు….కాల్ చేద్దాం అని ఫోన్ తీసుకుని చేయలేకపోతున్నారు…15 రోజులు ఆయిన్ది శ్రీలక్ష్మి వెళ్ళిపోయి…ఆరోజు కూడా బాగా తాగి హాలు లో నే కింద పనుకున్నాడు…తెల్లారి 4 గంటలకి మెలకువ వచ్చి కాసేపుకుర్చుని ఆలోచిస్తూ వున్నాడు…ఒక్క పది నిమిషాలు చూసి ఒక్కసారిశ్రీలక్ష్మి ని దూరం నుండైన చూద్దాం…ఎలాగో ఉదయం ఇంటిముందు కచ్చితం గా ముగ్గు వేస్తోంది అని ఇక ఆలస్యం చేయకుండా బులెట్ వేసుకుని బయలుదేరాడు…

సరిగ్గా పెన్నా నది దగ్గెరే కి రాగానే చీకట్లో ఒక మనిషి బ్రిడ్జి మీద నించుని గోడ ఎక్కి ఉంది….దగ్గెరకు వచ్చేసరికి శ్రీలక్ష్మి అని అర్థం అయి ఒక్కసారిగా ఆనందం తో పిలవబోతుంటే గోడ మీద ఉన్న శ్రీలక్ష్మి ఒక్కసారిగా నది లోకి దుకు.ది…వెంటనే బలరాం కూడా బులెట్ మీద నుండి నేరుగా నదిలోకి దుకేశాడు….చీకట్లో నీటిలో ఎవరు కనపడక పెద్దగా “ఏమే….ఎక్కడ”అని అరిచాడు….ఒక్కసారిగా శ్రీలక్ష్మి నీటిలో కొట్టుకుంటూ “బలరాం “అని అరవగానే వెంటనే వెళ్లి తీసుకుని ఒడ్డు కి వచ్చేస్తాడు….సేకను కూడా ఆలస్యం చేయకపోవడం వలన శ్రీలక్ష్మి కి ఏమి కాలేదు…ఒడ్డు న బలరాం కి దూరం గా కూర్చుని శ్రీలక్ష్మి ఏడుస్తూ ఉంది….బలరాం కూడా జీవితం లో మొదటిసారి తన కళ్ళ నుండి నీరు వస్తుంటే అవి శ్రీలక్ష్మి కి చూపించలేక తనకి దూరం గా వేరే వైపు నిలబడి అలానే ఉంటారు…

ఇద్దరు అలా దూరం గా తెల్లవారెవరకు మాట్లాడుకూరు…శ్రీలక్ష్మి తన మోకాళ్ళమీద తలా పెట్టి ఏడుస్తూ ఉంటుంది…బలరాం దూరం గా ఒక చెట్టుకి ఆనుకుని నిలుచుని ఆలోచిస్తూ ఉంటాడు…చదువుకుని లోకాజ్ఞానం తెలిసిన అమ్మాయి అవటం వలన శ్రీలక్ష్మి కి ముందుగా పరిష్కారం దొరికి లేచి బలరాం దగ్గెరే కి వెళ్లి “పద…ఇంటికి వెళ్దాం”అని అనగానే అప్పటివీక్రకు కొండంత బాధ ని ముఖ్నసులో దాచుకున్న బలరాం ఒక్కసారిగా శ్రీలక్ష్మి ని వాటేసుకుని గట్టిగా ఏడుస్తారు…ఇంతవరకు బలరాం ఏడవటం శ్రీలక్ష్మి చూడలేదు….బలరాం కళ్లనీళ్లు శ్రీలక్ష్మీ భుజం మీద పడి శ్రీలక్ష్మి బలరాం ని వాటేసుకుని “ఎడవకు…ఇక నేను ఎక్కడికి వెళ్ళను…నీతో నే ఉంట…మనల్ని ఎవరు విడదియ్యలేరు…”అని అంటుంది…ఇద్దరు సంతోషం గా రోడ్ ఎక్కి దారిన పోతున్న ఆటో ఎక్కి ఇంటికి వచేస్తారు….

10 సంవత్సరాల తర్వాత…..

బాగా కాస్ట్లీ కార్ లో శ్రీలక్ష్మి ఒక పెద్ద బంగ్లా ఎదురు దిగి లోపలకి వస్తుంది…లోపల వాళ్ళ అమ్మ హాల్ లో కూర్చుని శ్రీలక్ష్మి కి పుట్టిన ఏడాది బాబు ని ఆడిస్తూ ఉంటుంది….అలానే నడుచుకుంటూ గార్డెన్ లో కి వెళితే అక్కడ శ్రీలక్ష్మి నాన్న తన 4 ఎల్లా పాప వెనకాల పరుగెడుతు ఆడుకుంటున్నారు ఇద్దరు….ఇంతలో పనిమనిషి వచ్చి శ్రీలక్ష్మి కి టీ ఇవ్వగానే తీసుకుని “ఆయన పైన ఉన్నారా”అని అడిగితే “లేదమ్మగారు…..పెద్ద బాబు ని తీసుకురాటానికి స్కూల్ కి వెళ్లారు”అని చెప్పి వెళ్ళిపోతుంది…తర్వాత అరగంట సేపు బయట గార్డెన్ లో ఉయ్యాల మంచం లో కూర్చుని మేనేజర్ లు తీసుకు వచ్చిన ఫైల్స్ మొత్తం చూసి సంతకం పెడుతూ ఉంటే పక్కనే ఒక 8 మంది నుంచుని ఒకరి తర్వాత ఒకరు సంతకాలు తీసుకుంటున్నారు…ఫైల్స్ సరిగా లేని వారిని కోపం గా తిడుతూ ఉండగా బయట నుండి తన ఆరేళ్ళ బాబు మమ్మి అంటూ పరుగెత్తుకుంటూ వచ్చేసారు….ఫైల్ మేనేజర్ చేతికి ఇచ్చి బాబు ని ఎత్తుకుని నేరుగా లోపలకి వెల్లి బలరాం కోసం ఇల్లంతా వెతికింది…ఎక్కడా కనపడకపోయిసరికి వాళ్ళ అమ్మని అడిగితే “పైన బెడ్ రూమ్ కి వెళ్లాడమ్మ”అని చెప్పింది. బాబు ని దించేసి పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న బలరాం ని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టింది…బలరాం శ్రీలక్ష్మి కళ్ళలోకి చూస్తూ “ఏంటి విశేషం….మళ్ళీ కడుపు వచ్చిందా…”అని అడగగానే “ఇక చాలు ఆపండి…ఎంత మందిని కనాలి…ఇక చాలు…మీకు MLA ticket కన్ఫర్మ్ ఆయిన్ది…పార్టీ ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది”అని చెప్పగానే బలరాం “మనకి ఎందుకే అవన్నీ…బిసినెస్ లు చాలు…ఇన్నికోట్లు సంపాదించావ్….ఇంకా ఎందుకు”అని అంటారు…”రాజకీయం అంటే సంపాదించటమేన…అయినా నాకు ఎదురు చెప్పకండి…పదేళ్లు నేను చెప్పినట్లు విన్నారు…చూశారుగా ఎలా ఎదిగామో…. ఇక మీదట కూడా నేను చెప్పింది చెయ్యండి…”అని స్ట్రెయిట్ గా ఆర్డర్ వేసేసింది…

ఈ పదేళ్ల లో ఇంట్లో ఉన్న డబ్బు తో నెల్లూరు లో 10 షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టి అన్ని కూడా రెంట్ కి ఇచ్చేసింది…బలరాం ని సెటిల్మెంట్ లు ఆపించి బిల్డింగ్ దగ్గెరే సుపరువైసర్ గా ఉంచి పెద్ద బిల్డర్ ఆయిన్ది…4 ఎల్లా తర్వాత నెల్లూరు పక్కన పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టి బాగా సక్సెస్ ఆయిన్ది…మొత్తం బిసినెస్ శ్రీలక్ష్మి నే చూసుకుంటుంది….బలరాం కేవలం ఇంట్లో ఉండటం…బాబు ని స్కూల్ లో దించి తీసుకురావడం…బోరు కొట్టినప్పుడు శ్రీలక్ష్మి ఆఫీస్ కి వెళ్లి కాసేపు కూర్చుని రావటం….అంతా కంటే ఏమి చెయ్యనివ్వటం లేదు కూడా శ్రీలక్ష్మి…తన తెలివితేటలతో కొన్ని వందల కోట్లు సంపాదించింది…రాత్రైతే బలరాం,,,రామారావు కలిసి గార్డెన్ లో కూర్చుని మందు కొడుతున్నారు రోజు…అలా హ్యాపీ గా సాగిపోతుంది వాళ్ళ జీవితం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *